Hyderabad, ఫిబ్రవరి 21 -- గుడ్లు అంటేనే మనం వెంటనే గుర్తొచ్చేది ప్రొటీన్ ఫుడ్ అని. జిమ్‌కు వెళ్లేవారు, బరువు తక్కువ ఉన్న వారు తప్పక తీసుకునే ఆహారం గుడ్లు. శాఖాహారం, మాంసాహారం రెండింటిలో లేని రుచి గుడ్లలో దొరుకుతుంది. పోషక విలువల్లోనూ, రుచిలోనూ గుడ్లు బెస్ట్. కానీ, చాలా మంది గుడ్లను వండేటప్పుడు కొన్ని తప్పులు చేస్తారు. దీనివల్ల ఆరోగ్యానికి మేలు చేయకపోగా, హానికరంగా మారతాయి. మీరు కూడా ఈ 7 తప్పులు చేస్తున్నట్లయితే వెంటనే మానేయండి. ఏమిటో తెలుసుకుందాం.

చాలా మంది గుడ్లను అధికంగా వండుతారు. దీనివల్ల అందులో ఉండే పోషకాలు నశిస్తాయి. గుడ్డు ఉడకబెట్టే సమయంలో గమనించాల్సిన మరో విషయమేమిటంటే, గుడ్డులోని పసుపు భాగం చుట్టూ ఆకుపచ్చ రంగులో కనిపిస్తున్నట్లయితే అది అధికంగా ఉడికినట్లుగా భావించాలి. అలాగే గుడ్లను సగం ఉడకబెట్టి లేదా ఎక్కువ సేపు వండుకుని తినకూడదు. ఈ...