భారతదేశం, ఫిబ్రవరి 3 -- Edible Oil Prices: ఏపీలో వంట నూనెల ధరల నియంత్రణకు చేపట్టిన చర్యలు ముణ్ణాళ్ల ముచ్చటగా మారాయి. ఇప్పటికే మిల్లింగ్‌ ధరలకే సన్న బియ్యం విక్రయాలు మాయం కాగా తాజాగా వంట నూనెల ధరల నియంత్రణను కూడా ఎత్తేశారు. వంట నూనెల ప్యాకింగ్ యూనిట్లు, హోల్‌సేల్ వ్యాపారులను ఒప్పించి తగ్గింపు ధరలకు చేపట్టిన విక్రయాలు ఎక్కడా కనిపించడం లేదు. ధరల తగ్గింపులో వ్యాపారుల మాయాజాలం వెలుగులోకి వచ్చింది.

రిఫైండ్ ఆయిల్‌, పామాయిల్ ధరలపై గరిష్ట ధరల్ని నిర్ణయించి వాటిని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రకమైన ధరలతో వంట నూనెలు విక్రయించాలని వ్యాపారులను మంత్రి నాదెండ్ల అప్పట్లో ఆదేశించారు.

శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఒకే రకమైన ధరల్ని అమలు చేస్తున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల అప్పట్లో చెప్పారు. ఏపీలో ఇప...