భారతదేశం, ఫిబ్రవరి 22 -- ED summons Kejriwal: లిక్కర్ స్కామ్ (liquor scam) గా పాపులర్ అయిన ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఏడో సారి సమన్లు జారీ చేసింది. ఈ నెల 26 న తమ ముందు హాజరుకావాలని ఆ సమన్లలో ఈడీ కేజ్రీవాల్ ను ఆదేశించింది. ఈడీ ఇప్పటివరకు పంపిన ఆరు సమన్లను అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) పట్టించుకోలేదు. ఆ సమన్లు చట్టవిరుద్ధమని, అందువల్లనే కేజ్రీవాల్ విచారణకు హాజరు కావడం లేదని ఆప్ వాదిస్తోంది. ఈడీ కూడా కేజ్రీవాల్ ను పదేపదే హాజరుకావాల్సిందిగా కోరకుండా కోర్టు నిర్ణయం కోసం వేచి చూడాలని ఆప్ వ్యాఖ్యానించింది.

''ఈడీ నుంచి వచ్చిన సమన్లన్నింటికీ మేం సమాధానం ఇచ్చాం. చివరగా ఫిబ్రవరి 17 న సీఎం అరవింద్ కేజ్రీవాల్ వర్చువల్ గా కోర్టులోనే ఉన్నారు. తదుపరి విచారణను కోర్టు మ...