భారతదేశం, ఫిబ్రవరి 10 -- మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ హీరోహీరోయిన్లుగా నటించిన దేవర మూవీ గతేడాది మంచి హిట్ కొట్టింది. ఈ చిత్రంలోని చుట్టమల్లే పాట చాలా పాపులర్ అయింది. ఇండియాలోనే కాకుండా గ్లోబల్‍గా ఈ సాంగ్ ఊపేసింది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ మెలోడీ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు పాపులర్ ఇంగ్లిష్ సింగర్ ఎడ్ షీరన్.. నోట చుట్టమల్లే పాట వచ్చింది.

దేవర చిత్రంతో చుట్టమల్లే పాటను పాడిన శిల్పా రావుతో కలిసి ఈ పాటను పర్ఫార్మ్ చేశారు ఎడ్ షీరన్. బెంగళూరులో ఆదివారం జరిగిన కాన్సెర్ట్‌లో.. ఎందుకు పుట్టిందో.. పుట్టింది అంటూ తెలుగులో చుట్టమల్లే పాట పాడారు. శిల్పారావుతో కలిసి గొంతు కలిపారు షీరన్. వీరు పాట పాడుతుండగా ఆడిటోరియం దద్దరిల్లింది. ఈ సాంగ్‍లో అట్రాక్షన్ అయిన 'ఆ' అంటూ సౌండ్ చేస్తూ ప్రేక్షకులు కూడా అరి...