భారతదేశం, ఫిబ్రవరి 22 -- ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటిటెడ్‌ (ECIL), హైదరాబాద్ నుంచి ఉద్యోగ ప్రకటన జారీ అయింది. ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో టెక్నికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 200 ఖాళీలు ఉన్నాయి.

ఈ నోటిఫికేషన్ వివరాల ప్రకారం.. TO-C - కేటగిరి 1 కింద 100 ఖాళీలు ఉండగా, TO-C కేటగిరి 2 కింద 30, TO-C కేటగిరి 3 కింద మరో 70 ఖాళిలు ఉనున్నాయి. ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు బీఈ/బీటెక్/ఈసీఈ/ఈటీసీ/ ఈఈఈ/ఎలక్ట్రానిక్స్ లేదా సంబంధిత విభాగంలో ఉత్తీర్ణత పొందిఉండాలి.

ఈ పోస్టులకు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు పూర్తి చేయాలి.నేరుగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. మెరిట్ ఉన్న అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత గల అభ్యర్థులు 2026 ఫిబ్రవరి 24వ తేదీ ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూకి వచ్చే అభ్యర్థులు అప్లికేషన్ ఫ...