తెలంగాణ,హైదరాబాద్, ఫిబ్రవరి 26 -- హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం 17 ఉద్యోగాలను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. పలు విభాగాల్లో అసిస్టెంట్‌ ప్రాజెక్టు ఇంజినీర్, సీనియర్ ఆర్టీసన్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హులైన వారు.ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 17 పోస్టులను భర్తీ చేస్తారు.అసిస్టెంట్‌ ప్రాజెక్టు ఇంజినీర్ ఉద్యోగాలు 11 ఉండగా. వేర్వురు విభాగాల్లో ఇవి ఉన్నాయి. గ్రేడ్ 2 కేటగిరిలోని 7 పోస్టులకు ఈసీఈ, ఈఈఈ, ఈఐలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. మరో పోస్టుకు మాత్రం మెకానికల్ విభాగంలో డిగ్రీ ఉండాలి. ఈసీఈ, ఈఈఈ, ఈఐ అర్హతతో మరో రెండు అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్ ఖాళీలు ఉండగా... మెకానిక్ విభాగంలో ఒక్...