Hyderabad, ఫిబ్రవరి 15 -- ప్లాస్టిక్ కంటైనర్లలో తినడం వల్ల గుండె ఆగిపోయే ప్రమాదం ఉందట. గట్ బయోమ్లో మార్పుల వల్ల మంట, రక్త ప్రసరణ వ్యవస్థ దెబ్బతింటుందని పరిశోధకులు భావిస్తున్నారు. సైన్స్ డైరక్ట్ అనే జర్నల్‌లో ప్రచురితమైన ఈ కథనంలో మరిన్ని షాకింగ్ వాస్తవాలు వెలుగు చూశాయి.

ప్లాస్టిక్ కంటైనర్లలో వేడి ఆహారం ఉంచడం వల్ల అందులో నుంచి మైక్రో ప్లాస్టిక్స్ వెలువడతాయి. ఇవి మనం తినే ఆహారంలో చేరి, తద్వారా పేగుల్లోకి ప్రవేశిస్తాయట. ఇది గట్ లైనింగ్‌కు శారీరక నష్టాన్ని కలిగిస్తుంది. పేగులను అనారోగ్యానికి గురి చేస్తుంది. దీని ఫలితంగా హానికరమైన కణాలు రక్తంలోకి ప్రవేశిస్తాయి. ఇది ప్రసరణ వ్యవస్థను దెబ్బతీసే విధంగా డీ హైడ్రేటింగ్ కు దారి తీస్తాయి. ఆ విధంగా గుండె జబ్బుల ప్రమాదాన్ని పెరుగుతుంది.

అధ్యయనం గురించి పరిశోధకులు చెప్పిన దానిని బట్టి చాలా మంది దాదాపు గ...