Hyderabad, మార్చి 24 -- ఏ పండుగకైనా తీపి పదార్థాలు ఉండాల్సిందే. త్వరలో రంజాన్ పండుగ వచ్చేస్తుంది. ఆరోజు పాయసాలు ఘుమఘుమలాడుతాయి. అలాగే ఇక్కడ ఇచ్చిన హల్వా కూడా ప్రయత్నించి చూడండి. ఈ స్వీట్ రెసిపీ అద్భుతంగా ఉంటుంది. దీన్ని చేయడానికి పెద్దగా కష్టపడక్కర్లేదు. మూడు రకాల పదార్థాలు ఉంటే చాలు. సులువుగా చేసేయొచ్చు. అలాగే ఇంట్లో పండగలప్పుడు ప్రసాదాలు పెట్టాలనుకుంటే ఈ హల్వా ట్రై చేయండి. ఇది గోధుమపిండితో చేసే హల్వా. ఇక రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

గోధుమపిండి - ఒక కప్పు

నీళ్లు - రెండు కప్పులు

పంచదార - ఒక కప్పు

నెయ్యి - అరకప్పు

జీడిపప్పులు - గుప్పెడు

1. ఈ హల్వాలో మనం ప్రధానంగా వాడేవి గోధుమపిండి, పంచదార, నెయ్యి.

2. ఈ మూడింటితో స్వీట్ రెసిపీ చాలా తాజాగా టేస్టీగా తయారవుతుంది.

3. ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టి పంచదారను వేయండి.

4. అందులో రెండు కప్పుల న...