Hyderabad, మార్చి 26 -- క్రైస్తవ సోదరులు ఇష్టంగా జరుపుకునే పండుగల్లో ఈస్టర్ ఒకటి. ఆ రోజు చర్చలు, ప్రార్ధనలతో మారుమోగుతాయి. విందులు, వినోదాలు, బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడాలు, ఈస్టర్ ఎగ్స్ ఆటలు... ఇలా ఈ పండుగ ఎంతో సందడిగా జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా harithaఉన్న కోట్ల మంది క్రైస్తవులు ఈస్టర్ పండుగను ఎంతో సంతోషంగా నిర్వహించుకుంటారు. ఏసుక్రీస్తు పునరుత్థానాన్ని ఈస్టర్ పండుగగా నిర్వహించుకుంటారు.

ఈ ఏడాది ఈస్టర్ పండుగ ఏప్రిల్ 20న ఆదివారం వచ్చింది. మరణాన్ని జయించి వచ్చిన యేసును చూసి ఆనందంతో ఈస్టర్ పండుగ తొలిసారి నిర్వహించుకున్నారని చెప్పుకుంటారు. రోమన్లు యేసును శిలువ వేసిన తర్వాత ఆయన మరణిస్తాడు. అలా మరణించిన మూడు రోజుల తర్వాత ఆయన తిరిగి జీవించి వచ్చాడని చెబుతారు. అలా ఆయన జీవించి వచ్చినందుకు ఆనందంతో చేసే పండుగ ఈస్టర్ అని అంటారు.

ఈస్టర్ అంటే ఏసుక్రీ...