ఆంధ్రప్రదేశ్,తూర్పుగోదావరి జిల్లా, ఫిబ్రవరి 26 -- తూర్పుగోదావరి జిల్లాలోని తాడిపూడిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శివరాత్రి సందర్భంగా.. గోదావరిలో దిగిన ఐదుగురు యువకులు గల్లంతు కాగా.. ప్రాణాలు కోల్పోయారు. తిరుమల శెట్టి పవన్(17), పడాల సాయి కృష్ణ(19), పి. దుర్గాప్రసాద్‌ (19), జి.ఆకాశ్‌ (19), అనిశెట్టి పవన్(19) ను మృతులుగా గుర్తించారు.

యువకులంతా కొవ్వూరు, తాళ్లపూడి, రాజమహేంద్రవరంలో ఇంటర్, డిగ్రీ చదువుతున్న విద్యార్థులుగా గుర్తించారు. ఇవాళ తెల్లవారుజామున 10 మందికిపైగా యువకులు గోదావరిలో స్నానం చేసేందుకు వెళ్లారు. నదిలో లోతుగా ఉన్న ప్రదేశాన్ని గుర్తించకపోవడంతో వారిలో ఐదుగురు యువకులు నీటిలో మునిగిపోయారు. ఈ క్రమంలో ఒకరినొకరు రక్షించుకునే ప్రయత్నంలో ఆ ఐదుగురూ గల్లంతై ప్రాణాలు కోల్పోయారు. ఈత రాకపోవటం ఇందుకు కారణమైనట్లు తెలుస్తోంది.

సమాచారం అందుకు...