భారతదేశం, ఫిబ్రవరి 5 -- East Godavari Crime : తూర్పుగోదావ‌రి జిల్లాలో ఘోర‌మైన సంఘ‌ట‌న చోటుచేసుకుంది. ప్రేమించి, పెళ్లి చేసుకుంటాన‌ని న‌మ్మించి ఇంట‌ర్మీడియ‌ట్ విద్యార్థినిపై జూనియ‌ర్ కాలేజీ లెక్చర‌ర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘ‌ట‌న బ‌య‌ట‌కు పొక్కడంతో కీచ‌క లెక్చర‌ర్‌ పోలీసులకు లొంగిపోయాడు. నిందితుడిపై పోక్సో కేసు న‌మోదు చేశారు.

ఈ ఘ‌ట‌న తూర్పుగోదావ‌రి జిల్లాలో కొవ్వూరులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్రకారం రాజ‌మహేంద్రవ‌రంలోని ఓ ప్రైవేటు కాలేజీలో జూనియ‌ర్ లెక్చర‌ర్‌గా ప‌నిచేస్తున్న విన‌య్ వ‌ర్ధన్ అదే కాలేజీలో ఇంట‌ర్మీడియ‌ట్ ద్వితీయ సంవ‌త్సరం చ‌దువుతున్న కొవ్వూరుకు చెందిన విద్యార్థినితో ప్రేమ వ్యవ‌హారం న‌డిపాడు. అయితే లెక్చర‌ర్ విన‌య్ వ‌ర్ధన్‌కు గ‌తంలోనే వివాహం అయింది. 2014లో భార్యతో విడాకులు తీసుకుని ఒంట‌రిగానే ఉంటున్నాడు.

ఈ...