భారతదేశం, మార్చి 12 -- East Godavari Crime : తూర్పుగోదావ‌రి జిల్లాలో ఘోర‌మైన సంఘ‌ట‌న చోటు చేసుకుంది. క‌న్న కూతురుపైనే తండ్రి కొన్నాళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. మ‌నోవేద‌న‌తో ఉంటున్న ఆ చిన్నారిని గ‌మ‌నించి పాఠ‌శాల ఉపాధ్యాయురాలు ఆరా తీసింది. దీంతో ఆ చిన్నారి ఏడుస్తూ తాను ప‌డుతున్న బాధ‌ను, తాను అనుభ‌విస్తోన్న వేద‌నను ఉపాధ్యాయురాలికి చెప్పింది. ఉపాధ్యాయుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కుమార్తెపై అఘాయిత్యానికి పాల్పడుతున్న తండ్రిపై పోక్సో కేసు న‌మోదు చేశారు.

ఈ ఘ‌ట‌న తూర్పుగోదావ‌రి జిల్లా రాజ‌మహేంద్రవ‌రం త్రి టౌన్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటుచేసుకుంది. కూతురిపై కొన్నాళ్లుగా జ‌రుగుతున్న అఘాయిత్య ఘ‌ట‌న మంగ‌ళ‌వారం వెలుగులోకి వ‌చ్చింది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్రకారం త్రీ టౌన్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని 45 ఏళ్ల వ్యక్తి మెకాని...