భారతదేశం, మార్చి 16 -- తూర్పుగోదావ‌రి జిల్లా రాజ‌మ‌హేంద్ర‌వ‌రానికి చెందిన జోగాడ వంశీకృష్ణ అలియాస్ హ‌ర్ష చెరుకూరి (33) బీటెక్ మ‌ధ్య‌లోనే ఆపేశాడు. 2014లో హైద‌రాబాద్ వెళ్లాడు. 2015లో ఆన్‌లైన్ గేమింగ్‌, బెట్టింగ్ వంటి చ‌ట్ట‌వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు అల‌వాటు ప‌డ్డాడు. 2016లో జాబ్ క‌న్స‌ల్టెన్సీలో చేరి యువ‌కుల‌ను ఉద్యోగాల పేరుతో మోసం చేశాడు. ఈ కేసులో వంశీకృష్ణ అరెస్టు కూడా అయ్యాడు. జైలు నుంచి విడుద‌లైన వంశీకృష్ణ సోష‌ల్ మీడియాల్లో మ‌హిళ‌ల పేర్ల‌తో ఫేక్ అకౌంట్స్ సృష్టించి త‌న ఆదాయంలో అధికశాతం సేవా కార్య‌క్ర‌మాల‌కు వెచ్చిస్తున్న‌ట్లు న‌మ్మించి డ‌బ్బులు వ‌సూలు చేసేవాడు. ఇలా దాదాపు వెయ్యి మంది నుంచి డ‌బ్బులు వ‌సూలు చేశాడు.

ఆ త‌రువాత యానాంలోని ఓ ఎమ్మెల్యే ఫోటో డీపీగా పెట్టుకుని ఉద్యోగ అవ‌కాశాల పేరుతో 50 మంది మ‌హిళ‌లు, యువ‌తుల‌ను నుంచి దాదాపు రూ.2.5...