భారతదేశం, ఫిబ్రవరి 21 -- తూర్పుగోదావ‌రి జిల్లా తాళ్ల‌పూడి మండ‌లంలోని ఒక గ్రామంలో దారుణం జరిగింది. ఇంటర్ విద్యార్థినిపై యువకుడు దాడి చేశాడు. ఈ ఘటన గురించి పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ఓ విద్యార్థిని ఇంట‌ర్మీడియ‌ట్ ద్వితీయ సంవ‌త్స‌రం చ‌దువుతోంది. అదే కాలేజీలో చ‌దివిన‌ప్పుడు గ‌జ్జ‌వ‌రం గ్రామానికి చెందిన గుల్ల దిలీప్ కుమార్‌కి ఆ విద్యార్థినితో ప‌రిచ‌యం ఏర్ప‌డింది.

గుల్ల దిలీప్ కుమార్‌ ఇంట‌ర్మీడియ‌ట్ మ‌ధ్య‌లోనే మానేసి పొగాకు ప‌నుల‌కు వెళ్తున్నారు. కాలేజీలో చ‌దివేటప్పుడే ప‌రిచ‌యం ఉండ‌టంతో కొంత కాలంగా ఆమె వెంట‌ప‌డుతున్నాడు. ప్రేమిస్తున్నానంటూ వేధిస్తున్నాడు. అందుకు ఆ విద్యార్థిని నిరాక‌రించింది. దీంతో కాలేజీకి వెళ్లి విద్యార్థినిపై చేయి చేసుకున్నాడు. అయినా ఆమె అంగీకరించలేదు.

మళ్లీ ఈనెల 19న బుధ‌వారం మ‌రోసారి కాలేజీకి వెళ్లాడు. త‌న‌ను ప్ర...