Hyderabad, మార్చి 3 -- భూకంపాలు ఊహించలేని ప్రకృతి విపత్తులు. ఇవి ప్రాణ నష్టాన్ని, ధన నష్టాన్ని మిగులుస్తాయి. వీటిని ఆపడం అసాధ్యం కానీ సాంకేతికత సహాయంతో వీటి గురించి ముందే తెలుసుకొని ప్రాణాలను కాపాడుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ల సాయంతో భూకంపం రాకను ఎలా తెలుసుకోవాలో ఇక్కడ ఇచ్చాము. దీనివల్ల మీరు సురక్షితమైన ప్రాంతాలకు వెళ్ళవచ్చు.

ఆధునిక స్మార్ట్ ఫోన్లు భూకంపం సంభవించే ముందు దాని గురించి మిమ్మల్ని హెచ్చరించగలవు. చాలా ఫోన్లలో యాక్సిలేరోమీటర్లు అని పిలిచే అంతర్నిర్మిత మోషన్ సెన్సార్లు ఉంటాయి. ఇవి భూమి నుంచి వచ్చే ప్రారంభ ప్రకంపనలను గుర్తిస్తాయి. ఒకే ప్రాంతంలోని అనేక ఫోనులు ఒకే సమయంలో భూకంప ప్రకంపనలను గుర్తిస్తే అవి సెంట్రల్ సర్వర్ డేటాకు ఈ విషయాన్ని చేరుస్తాయి. ఆ సర్వర్ భూకంపం ఎక్కడ ఏర్పడే అవకాశం ఉందో, ఎంత బలంగా వచ్చే అవకాశం ఉందో గుర్తించి తిరిగి అద...