భారతదేశం, మార్చి 28 -- భారీ భూకంపాల ఘటనలతో ఆగ్నేయ ఆసియా ఉలిక్కిపడింది! మయన్మార్​లో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. పొరుగున ఉన్న థాయ్​లాండ్​ రాజధాని బ్యాంకాక్​లోనూ భూమి కంపించింది. భూకంపానికి సంబంధించిన దృశ్యాలను సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి. అవి భయానకంగా ఉన్నాయి.

సెంట్రల్​ మయన్మార్​లో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు యూఎస్​ జియోలాజికల్​ సర్వే తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:50 గంటలకు సగింగ్ నగరానికి వాయవ్యంగా 16 కిలోమీటర్ల దూరంలో, 10 కిలోమీటర్ల లోతులో భూ ప్రకంపనలు సంభవించినట్లు యూఎస్​జీఎస్ తెలిపింది.

అయితే ఈ భారీ భూకంపం తర్వాత 6.4 తీవ్రతతో మళ్లీ భూప్రకంపనలు వెలుగులోకి వచ్చాయని సమాచారం. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.

మయన్మార్​ పొరుగున ఉన్న థాయ్​లాండ్​ రాజధాని బ్యాంకాక్​లో కూడా ప్రకంపనలు వెలుగులోకి వచ్చాయి. 10...