Hyderabad, ఫిబ్రవరి 18 -- గ్రామీణ వాతావరణంలో ఉదయాన్నే లేవడం, పనులు చేసుకోవడం చాలా సాధారణంగా జరిగిపోతుంటాయి. కానీ, సిటీ లైఫ్‌కు వస్తే అది పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. మనలో చాలా మంది దాదాపు గ్రామీణ మూలాలు ఉన్నవారే. అప్పుడప్పుడు ఊర్ల నుంచి వచ్చే పెద్ద వాళ్లు లేదా బంధువులు ఉదయాన్నే లేవాలి. అలా లేచి పనులు చేసుకుంటే, జీవితంలో సక్సెస్ సాధిస్తారని చెబుతుంటారు. అది కేవలం మాటల వరకేనా? అందులో వాస్తవమెంత వరకూ ఉంది? అనే విషయంపై చాలా అధ్యయనాలు జరిగాయి. ఉదయాన్నే లేవడానికి, విజయం సిద్ధించడానికి ఏదైనా సంబంధం ఉందా ? అనే అంశంపై జరిపిన స్టడీలలో తేలిన ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి.

లండన్ యూనివర్సిటీ కాలేజ్ చేసిన ఒక స్టడీలో, మార్చ్ 2020 నుండి మార్చ్ 2022 వరకు ఇదే అంశం మీద దాదాపు ఒక పదికి పైగా సర్వేలు జరిగాయి. ఈ సర్వేలలో పాల్గొన్న 49,218 మంది డేటాను విశ్లేషించారు ర...