Hyderabad, మార్చి 24 -- చెవి నొప్పి ప్రాణాంతకమైనది కాకపోవచ్చు. కానీ చాలా బాధ పెడుతుంది. ఆ నొప్పిని తట్టుకోవడం చాలా కష్టం. కొన్ని ఇంటి చిట్కాల ద్వారా వాటిని తగ్గించుకోవచ్చు. చెవి నొప్పి... జలుబు వల్ల లేదా ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల వస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి డాక్టర్ అందుబాటులో ఉంటారు, కానీ కొన్నిసార్లు వైద్యులు వద్దకు వెళ్లేందుకు ఎక్కువ సమయం పట్టవచ్చు. అలాంటప్పుడు చెవి నొప్పిని తగ్గించడానికి ఇక్కడ చెప్పిన పద్ధతుల్లో ఏదైనా పాటించండి.

చెవి మధ్య నుండి గొంతు వెనుక వరకు ఒక ట్యూబ్ ఉంటుంది. ఇది ద్రవాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ట్యూబులో అడ్డంకులు ఏర్పడితే ద్రవం అధికంగా పేరుకుపోతుంది. ఇది చెవిపై విపరీతమైన ఒత్తిడిని పెంచుతుంది. దీనివల్ల కూడా నొప్పి వస్తుంది. దీనికి సరైన సమయంలో చికిత్స అందించాలి. లేకపోతే ఇన్ఫెక్షన్ గా మారి ఇబ్బంది పెడుతూ ఉంటుంది.

జలుబు,...