భారతదేశం, ఫిబ్రవరి 9 -- Eagle Twitter Review: మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా న‌టించిన ఈగ‌ల్ మూవీ ఈ శుక్ర‌వారం (ఫిబ్ర‌వ‌రి 9న‌) థియేట‌ర్ల‌లో రిలీజ్ కానుంది. సినిమాటోగ్రాఫ‌ర్ కార్తిక్ ఘ‌ట్ట‌మ‌నేని ఈగ‌ల్‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ధ‌మాకా స‌క్సెస్ త‌ర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్‌లో ర‌వితేజ చేసిన మూవీ ఇది. ఈగ‌ల్‌లో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, కావ్య థాప‌ర్ హీరోయిన్లుగా న‌టించారు. రావ‌ణాసుర‌, టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు డిజాస్ట‌ర్స్ త‌ర్వాత వ‌చ్చిన ఈ మూవీ ర‌వితేజ మ‌ళ్లీ క‌మ్ బ్యాక్ ఇచ్చాడా? బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కొట్టాడా? ఈగ‌ల్ సినిమా ప్రీమియ‌ర్స్ టాక్ ఎలా ఉందంటే?

బ్యాక్ టూ బ్యాక్ డిజాస్ట‌ర్స్ త‌ర్వాత ఈగ‌ల్‌తో ర‌వితేజ మ‌ళ్లీ అదిరిపోయే క‌మ్‌బ్యాక్ ఇచ్చాడ‌ని నెటిజ‌న్లు ట్వీట్స్ చేస్తున్నారు. తెలుగులో వ‌చ్చిన వ‌న్ ఆఫ్ ది బెస్ట్ యాక్ష‌న్ మూవీగా ఈగ‌ల్ ...