భారతదేశం, ఫిబ్రవరి 23 -- E-Shram Card Apply : కరోనా సమయంలో వలస కార్మికులు, అసంఘటిత రంగ కార్మికుల కష్టాలను పరిగణలోకి తీసుకుని, సుప్రీంకోర్టు ఆదేశాలతో కేంద్ర ప్రభుత్వం అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించే ఉద్దేశంతో ఈ-శ్రమ్ పోర్టల్ ప్రవేశపెట్టింది. 26.08.2021 నుంచి అసంఘటిత రంగ కార్మికుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించింది.

అర్హులైన భవన నిర్మాణ కార్మికులు, వ్యవసాయ కూలీలు, వలస కార్మికులు, రిక్షా తొక్కేవారు, ఇళ్లలో పని చేసేవారు, మత్స్యకారులు, ఉపాధి హామీ కార్మికులు, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు, చిరు వ్యాపారులు, తోపుడు బండ్ల వ్యాపారులు ఈ-శ్రమ్ కార్డులు అందిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అసంఘటిత రంగ కార్మికులకు E-shram కార్డుల నమోదు ప్రక్రియను మళ్లీ మొదలుపెట్టాయి.

ఏపీలో ఈ-శ్రమ్ కార్డుల క్యాంపులు నిర్వహిస్తున్నారు. గ్రామ, వార్...