భారతదేశం, మార్చి 4 -- Duvvada Srinivas : వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లలో జనసేన నేతలు ఫిర్యాదులు చేస్తున్నారు. అవనిగడ్డ, మచిలీపట్నం, అమలాపురం, కొవ్వూరు పోలీస్ స్టేషన్లలో దువ్వాడ శ్రీనివాస్ పై ఫిర్యాదు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై తగిన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని అవనిగడ్డ మండల జనసేన అధ్యక్షుడు గుడివాక శేషుబాబు అవనిగడ్డ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై పెడన నియోజవర్గ జనసేన నాయకులు మచిలీపట్నం డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. అమలాపురం, కొవ్వూరులో సైతం దువ్వాడ శ్రీనివాస్ పై ఫిర్యాదు చేశారు.

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై...