భారతదేశం, డిసెంబర్ 10 -- చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి ప్రవహిస్తుంది, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వాస్తు ప్రకారం పాటించడం వలన ఆనందంగా ఉండడానికి అవుతుంది, ఇబ్బందులు అన్ని తొలగిపోతాయి. చాలా మంది వాస్తు ప్రకారం అనుసరిస్తారు. ఇంటిని నిర్మించడం మొదలు ఇంట్లో ఉన్న వస్తువులను వాస్తు ప్రకారం ఏ దిశలో పెట్టాలి అనే దాని వరకు ప్రతిదీ కూడా ఫాలో అవుతూ ఉంటారు. అయితే పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకుండా చూసుకోవాలి. వాస్తు శాస్త్రం ప్రకారం ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

చాలా మంది ఇంట్లో చెత్తబుట్టను సరిగ్గా ఉంచరు. ఎప్పుడూ కూడా ఇంట్లో ఉన్న చెత్త చెత్తేనని ఎప్పటికప్పుడు తొలగించాలి. చెత్తబుట్టను కూడా సరైన దిశలో ఉంచాలి. వాస్తు ప్రకారం చెత్తబుట్టను పెట్టడం వలన ప్రతికూల శక్తి కలగకుండా ఉంటుంది...