భారతదేశం, ఏప్రిల్ 16 -- Dune Part 2 OTT: ఈ ఏడాది హాలీవుడ్‌లో అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన సినిమాల్లో ఒక‌టిగా డ్యూన్ పార్ట్ 2 మూవీ నిలిచింది. 190 (1500 కోట్లు) మిలియ‌న్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 685 కోట్ల (4500 కోట్లు) వ‌ర‌కు వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. 2024లో హాలీవుడ్‌లో హ‌య్యెస్ట్ గ్రాసింగ్ మూవీస్‌లో ఒక‌టిగా రికార్డ్ క్రియేట్ చేసింది.థియేట‌ర్ల‌లో వ‌సూళ్ల ప్ర‌భంజ‌నాన్ని సృష్టించిన ఈ మూవీ తాజాగా ఓటీటీలోకి వ‌చ్చేసింది.

ఆమెజాన్ ప్రైమ్ వీడియోలో మంగ‌ళ‌వారం నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్‌తో పాటు బుక్‌మై షో ఓటీటీలోనూ రెంట‌ల్ విధానంలో ఈ సినిమా రిలీజైంది. డ్యూన్ పార్ట్ 2ను ఓటీటీలో చూడాలంటే అమెజాన్ ప్రైమ్ స‌బ్‌స్క్రిప్ష‌న్‌తో పాటు అద‌నంగా 499 రూపాయ‌లు చెల్లించాల్సి వుంటుంది.

డ్యూన్ పార్ట్ 2 మూవీకి డెన్నిస్ విల్లెనెయువ్ ద‌...