భారతదేశం, ఫిబ్రవరి 25 -- Ducati DesertX Discovery: డుకాటి డెసర్ట్ ఎక్స్ డిస్కవరీ అడ్వెంచర్ మోటార్ సైకిల్ భారతదేశంలో రూ .21.78 లక్షల ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరతో లాంచ్ అయింది. ఈ డెసర్ట్ ఎక్స్ డిస్కవరీ తో భారత మార్కెట్ లో డుకాటీ వాటా మరింత పెరుగుతుందని ఆశిస్తున్నట్లు డుకాటీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ బిపుల్ చంద్ర పేర్కొన్నారు. డెసర్ట్ ఎక్స్ డిస్కవరీ భారత్ లో డుకాటీ అడ్వెంచర్ మోటార్ సైకిల్ లైనప్ కు మరింత పవర్ ను జత చేస్తుంది. ఈ లైనప్ లో ఇప్పటికే డెసర్ట్ ఎక్స్, మల్టీస్ట్రాడా వి 4, మల్టీస్ట్రాడా వి 2, తదితర బైక్స్ ఉన్నాయి.

డిజైన్ పరంగా, డెసర్ట్ఎక్స్ డిస్కవరీ డెజర్ట్ఎక్స్ మాదిరిగానే ఉంటుంది. అయితే డెసర్ట్ఎక్స్ డిస్కవరీలో కొన్ని విభిన్న అంశాలున్నాయి. ఈ కొత్త అడ్వెంచర్ మోటార్ సైకిల్ నలుపు, తెలుపు, ఎరుపు రంగుల విలక్షణమైన లివరీలో పెయింట్ చేయబడింది. ఇ...