భారతదేశం, జనవరి 30 -- మీకు అడ్వెంచర్ చేయడం ఇష్టమైతే.. మంచి ఇంజిన్ ఉన్న మోటార్ సైకిల్ కోసం చూస్తే.. మీ కోసం ఓ గుడ్‌న్యూస్. ఎందుకంటే డుకాటీ ఇండియా తన కొత్త, విలాసవంతమైన డుకాటీ ఎక్స్ డిస్కవరీ బైక్ బుకింగ్ ప్రారంభించింది. ఈ బైక్ ను గతంలో పలుమార్లు ఆన్‌లైన్‌లో టీజ్ చేశారు. త్వరలోనే అధికారికంగా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ గ్రేట్ అడ్వెంచర్ బైక్ ఫీచర్లు, ధర గురించి తెలుసుకుందాం.

డుకాటీ డెసర్ట్ ఎక్స్ డిస్కవరీ అడ్వెంచర్, ఆఫ్-రోడింగ్ రైడర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఈ బైక్ డిజైన్ దాని డెసర్ట్ ఎక్స్ బైక్‌ను పోలి ఉంటుంది. అయితే దీనికి నలుపు, ఎరుపు పెయింట్ ఇచ్చారు. ఇది మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఈ బైక్ హార్డ్ కేస్ పానియర్స్(లగేజీ క్యారియర్), ఇంజిన్ కవర్ ప్రొటెక్షన్, పెద్ద బెల్లీ గార్డ్‌తో వస్తుంది. దూర ప్రయాణాలకు మంచి ఆప్షన్.

డుకాటీ డెసర్ట్ ...