Hyderabad, ఏప్రిల్ 8 -- నానబెట్టిన నట్స్, డ్రై ఫ్రూట్స్ వంటివి ఉదయం పరగడుపున అల్పాహారంలో తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఈ గింజల్లో విటమిన్ ఎ, సి, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ వంటి అనేక పోషక పదార్థాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి సంబంధించిన అనేక సమస్యలను తొలగించడంలో సహాయపడతాయి. పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం, గింజలలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్ ఉంటుంది. నట్స్ నానబెట్టడం ద్వారా వాటిలో ఉండే ప్రోటీన్ పాక్షికంగా జీర్ణమవుతుంది. గింజలను నానబెట్టడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

వేసవిలో శరీరం వేడెక్కిపోతుంది. దానికి చలువదనంతో పాటూ, శక్తి అవసరం. అటువంటి పరిస్థితిలో, నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. చాలా డ్రై ఫ్రూట్స్ వేడి చేస్తాయి. కానీ నానబెట్టిన తర్వాత అవి చలువదనాన్ని ఇస్తాయి. బాదం,...