Hyderabad, ఫిబ్రవరి 17 -- వాతావరణం మారుతున్న కొద్దీ చర్మపు స్వభావంలో అనేక మార్పులు గమనిస్తాం. మొఖంతో పాటు చేతులపై చర్మం పొడిబారిపోయి సమస్యగా మారుతుంది. ఇది కేవలం వాతావరణం వల్లనే ఏర్పడిందని భావించి మిమ్మల్ని మీరు మోసగించుకోకండి. ఇది చర్మ సమస్య కూడా కావొచ్చు. డైషిడ్రోటిక్ ఎగ్జిమా అనే చర్మ సమస్య కూడా మీ వేళ్ల మధ్య చర్మాన్ని పొడిగా మార్చేయొచ్చు.

చర్మం ఆరోగ్యంగా ఉండటానికి వాతావరణం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. చల్లటి వాతావరణంతో పాటు తక్కువపాటి తేమ చర్మాన్ని ఇబ్బందికి గురి చేస్తుంది.ఫలితంగా చర్మం పొడిబారి, వేళ్ల మధ్యలో మరింత బిగుతుగా మారిపోతుంది.

ఈ సమస్యను డైషిడ్రోసిస్ అని కూడా పిలుస్తారు. ఇది పాదాలలో, అరచేతులలో కలగొచ్చు. చిన్న పరిమాణంలో మొదలై క్రమంగా పెరుగుతుంటాయి. ఇది జెనెటికల్ గా, అలర్జిక్ రియాక్షన్స్ కారణంగా, చెమట ఎక్కువగా పట్టడం వల్ల, రోగ...