Hyderabad, జనవరి 24 -- చలికాలంలో దగ్గు, జలుబు, జ్వరం బారిన తరచూ పడుతూ ఉంటారు. వీటిలో ఎక్కువగా బాధపెట్టేది దగ్గు. ముఖ్యంగా పొడి దగ్గు వల్ల గొంతు ఎంతో ఇబ్బంది పడుతుంది. పొడి దగ్గు ఉన్నప్పుడు అందులో శ్లేష్మం ఉండదు. ఎందుకంటే ఊపిరితిత్తులు, శ్వాసనాళాల్లో శ్లేష్మం ఉండదు. కాబట్టి దగ్గినప్పుడు ఏమీ బయటకు రాదు. శ్లేష్మం లేకపోవడం వల్ల ఎక్కువ దగ్గు వస్తుంది. ఇది గొంతు తడారిపోయేలా చేస్తుంది. అక్కడ చర్మం రాసుకుపోయినట్టు అవుతుంది.

పొడి దగ్గు వచ్చినప్పుడు గొంతులో మంట, గరగరగా ఉంటుంది. కాబట్టి దాన్ని వదిలించుకోవడానికి తరచూ దగ్గుతారు. గట్టిగా దగ్గినప్పుడు గాలి లోపలికి ప్రవేశించి గొంతును మరింత చికాకుపెడుతుంది. దీనివల్ల గొంతు పొడిబారి గొంతునొప్పి వస్తుంది.

పొడి దగ్గు రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. అలెర్జీ , ఆస్తమా, కొన్ని రకాల మందులు, చికాకు కలిగించే గాలిన...