Hyderabad, మార్చి 11 -- వేసవి వచ్చిందంటే మిమ్మల్ని తరచూ డీహైడ్రేషన్ సమస్య వేదిస్తుంటుంది. దీని ఫలితంగా వ్యక్తికి హీట్ స్ట్రోక్, తలతిరగడం, తలనొప్పి, గుండె కొట్టుకోవడంలో మార్పులు, కండరాల నొప్పులు, అలసట వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే, శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవాల్సిందే. దాని కోసం రోజులో సరిపడ మొత్తంలో నీరు తాగుతుండాలి. అలా నీరు తాగడం వల్ల శరీరాన్ని డీటాక్సిఫై చేయడంతో పాటు అనేక ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. చాలా మంది సమస్యలు రాకుండా ఉండేందుకు, నీరు ఎక్కువగా తాగుతారు. కానీ, కొన్ని పొరబాట్లు చేస్తుంటారట. అధ్యయనాల ప్రకారం చూస్తే, దాదాపు 85 శాతం మందికి పైగా నీరు తప్పుగా తాగుతారని తెలిసింది.

దీని కారణంగా జుట్టు రాలడం, మలబద్ధకం, గుండె జబ్బులకు కారణమవుతుందట. అందుకే నీరు త్రాగే సరైన విధానం ఏంటి?, తప్పుగా నీరు త్రాగడం వల్ల...