Hyderabad, ఏప్రిల్ 2 -- ప్రతి మహిళా జీవితంలో పీరియడ్స్ కు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఒక్కో మహిళకు ఒక్కోలా పీరియడ్స్ వస్తూ ఉంటాయి. కొంతమందికి ప్రతి 20 రోజులకు వస్తుంటే, మరికొంతమందికి ప్రతి 30 రోజులకు వస్తాయి. 20 నుంచి 35 రోజుల మధ్యలో పీరియడ్స్ ఎప్పుడైనా రావచ్చు.

అయితే ఒక్కోసారి పీరియడ్ రావడం ఆలస్యం అవుతూ ఉంటాయి. అలాగే కొన్ని రకాల సమస్యల వల్ల కూడా పీరియడ్స్ రావు. హార్మోన్ల అసుమతుల్యత కారణంగా పీరియడ్స్ రానివారు ఎంతోమంది ఉంటారు. ఇది వారి పునరుత్పత్తి వ్యవస్థ పై ఎంత ప్రభావాన్ని చూపిస్తుంది.

కాబట్టి ఆలస్యంగా మీకు పీరియడ్స్ వస్తూ ఉంటే ప్రతిరోజు ఆహారంలో దాల్చిన చెక్క టీ లేదా పానీయాన్ని చేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఇది ఎన్నో రకాల ఉపయోగపడుతుంది.

హార్మోన్ల అసమతుల్యత కారణంగా ఎంతోమంది మహిళలకు పీరియడ్స్ రాక ఇబ్బంది పడుతున్నారు. క్రమరహిత పీరియడ్స్ అన...