Hyderabad, మార్చి 26 -- పచ్చి చేపలతో పోలిస్తే ఎండు చేపలు తక్కువ ధరకే లభిస్తాయి. అలాగే అవి ఎక్కువ కాలం నిల్వ కూడా ఉంటాయి. అందుకే ఎండు చేపల్ని ఎక్కువగా తింటూ ఉంటారు. తీర ప్రాంతంలోని ప్రజలు వారంలో నాలుగైదు రోజులు ఎండు చేపలు తినేందుకే ఇష్టపడతారు. ఇవి రుచిగా ఉండటమే కాదు, ఎన్నో రకాల పోషకాలను కూడా కలిగి ఉంటాయి. అయితే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు మాత్రం ఎండు చేపలకు దూరంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. ఎవరెవరు ఎండు చేపలకు దూరంగా ఉండాలో తెలుసుకోండి.

పచ్చి చేపలతో పోలిస్తే ఎండు చేపలు ఒక్కసారి కొనుక్కుంటే నెలల తరబడి నిల్వ ఉంటాయి. అందుకే ప్రతి ఇంట్లో కూడా ఎండు చేపలు కనిపిస్తూ ఉంటాయి. కొంతమందికి ఈ వీటన్నించి వచ్చే వాసన నచ్చక తినడం మానేస్తూ ఉంటారు. అయితే ఎండు చేపలు తినడం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

ఎండు చేపల్లో ఫాస్పరస్, క్య...