భారతదేశం, ఫిబ్రవరి 13 -- Dragon Movie: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్‌గా న‌టించిన త‌మిళ మూవీ డ్రాగ‌న్ తెలుగులో రిలీజ్ అవుతోంది. ఈ రొమాంటిక్ ల‌వ్ డ్రామా మూవీలో ల‌వ్ టుడే ఫేమ్ ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ హీరోగా న‌టిస్తోన్నాడు. అశ్వ‌త్ మారిముత్తు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. ఈ సినిమా తెలుగులో రిట‌ర్స్ ఆఫ్ ది డ్రాగ‌న్ అనే టైటిల్‌తో విడుద‌ల‌ అవుతోంది. ఫిబ్రవరి 21న తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

డ్రాగ‌న్ తెలుగు ట్రైల‌ర్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. ఈ ట్రైల‌ర్‌లో ఇంజినీరింగ్‌లో 48 బ్యాక్‌లాగ్‌లు ఉన్న యువ‌కుడిగా ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ క‌నిపిస్తున్నాడు. చ‌దువు సంధ్య‌లు లేకుండా అంద‌రితో గొడ‌వ‌లు పెట్టుకుంటూ స‌ర‌దాగా లైఫ్‌ను ఎంజాయ్ చేసే కుర్రాడిగా అత‌డి క్యారెక్ట‌ర్‌ను ట్రైల‌ర్‌లో ప‌రిచ‌యం చేశారు. కాలేజీ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిన త‌ర్...