భారతదేశం, ఫిబ్రవరి 22 -- Dragon: bఅనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ రిట‌ర్న్ ఆఫ్ ది డ్రాగ‌న్ మూవీ టాలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద అద‌ర‌గొడుతోంది. తెలుగు, త‌మిళ భాష‌ల్లో క‌లిపి తొలిరోజు 11 కోట్ల‌కుపైగా గ్రాస్‌, ఆరు కోట్ల వ‌ర‌కు షేర్ క‌లెక్ష‌న్స్‌ను రాబ‌ట్టింది. తెలుగు వెర్ష‌న్ శుక్ర‌వారం రోజు కోటి ఇర‌వై ల‌క్ష‌ల‌కుపైగా వ‌సూళ్ల‌ను ద‌క్కించుకున్న‌ది. శుక్ర‌వారం రోజు రిలీజైన తెలుగు సినిమాల కంటే డ‌బ్బింగ్ మూవీ రిట‌ర్న్ ఆఫ్ ది డ్రాగ‌న్ ఎక్కువ‌గా క‌లెక్ష‌న్స్‌ను సొంతం చేసుకోవ‌డం గ‌మ‌నార్హం.

రిట‌ర్న్ ఆఫ్ ది డ్రాగ‌న్ మూవీ తొలిరోజు మూడు కోట్ల వ‌ర‌కు క‌లెక్ష‌న్స్‌ను ద‌క్కించుకునే అవ‌కాశం ఉంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు భావించాయి. కానీ వారి అంచ‌నాల‌ను త‌ల‌క్రిందులు చేస్తూ రెట్టింపు వ‌సూళ్ల‌ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వ‌ద్ద కుమ్మేసింది. రెండు రోజు కూడా తెలుగులో ఈ మూవీ కోటి వ‌ర...