Hyderabad, ఫిబ్రవరి 26 -- Mazaka Director Trinadha Rao Nakkina On Double Dhamaka: మాస్ మహారాజా రవితేజ, డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల జోడీగా నటించిన సినిమా ధమాకా. బాక్సాఫీస్ వద్ద ధమాకా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందో తెలిసిందే. రూ. 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన ధమాకు సీక్వెల్‌పై చాలా అంచనాలు ఉన్నాయి.

ధమాకా సీక్వెల్‌ను డబుల్ ధమాకా అనే టైటిల్‌తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. అయితే, సందీప్ కిషన్, రీతు వర్మ జోడీగా, రావు రమేష్-అన్షు కీలక పాత్రల్లో నటించిన కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం మజాకా. రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ కథ, సంబాషణలు అందించిన మజాకా మూవీ ఇవాళ (ఫిబ్రవరి 26) థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ నేపథ్యంలో మజాకా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు త్రినాథ రావు సినీ విశేషాలను పంచుకున్నారు. ఈ క్రమంలో డబుల్ ధమాకాపై మీడియా అడిగిన ప్...