భారతదేశం, ఏప్రిల్ 20 -- Doordarshan logo changed : ప్రముఖ ఆటోనోమస్​ పబ్లిక్​ టీవీ బ్రాడ్​క్యాస్టర్​ దూరదర్శన్​ ఆవిష్కరించిన కొత్త లోగోపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లోగోను.. ఎరుపు రంగు నుంచి కాషాయం రంగులోకి మార్చడాన్ని అనేక మంది తప్పుపడుతున్నారు. మరీ ముఖ్యంగా.. విపక్ష పార్టీలు.. దూరదర్శన్​ చర్యలపై మండిపడుతున్నాయి.

దూరదర్శన్​కి చెందిన ఇంగ్లీష్​ న్యూస్​ ఛానెల్​ డీడీ న్యూస్​.. కొత్త లోగోను ఇటీవలే ఆవిష్కరించింది.

"మా విలువలను అలాగే ఉంచుతూ.. మేము కొత్త అవతారంలో మీ ముందుకు వస్తున్నాము. మునుపెన్నడూ లేని విధంగా.. ఓ కొత్త ప్రయాణానికి సిద్ధం అవ్వండి. సరికొత్త డీడీ న్యూస్​ని ఎక్స్​పీరియెన్స్​ చేయండి," అని ఎక్స్​ (ట్విట్టర్​)లో పోస్ట్​ చేసింది డీడీ న్యూస్​.

Doordarshan logo color : సరిగ్గా ఎన్నికల సమయంలో దూరదర్శన్​.. తన లోగోను మార్చడం,...