Hyderabad, ఫిబ్రవరి 11 -- ఆహారాన్ని ఇతరులతో పంచుకుని తింటే ఆనందం రెట్టింపవుతుంది. అందుకే షేరింగ్ ఈజ్ కేరింగ్ అంటారు. ఇది నిజమే. కానీ ప్రతి విషయానికీ ఇది వర్తించదు. వాస్తవానికి, కొన్ని వస్తువులను ఎవరితోనూ పంచుకోకూడదు. ముఖ్యంగా మీ ఆరోగ్యం, అందాన్ని కాపాడుకోవాలనుకుంటే, కొన్ని వస్తువులును వ్యక్తిగతంగా మీరు మాత్రమే వాడుకోవాలి. చాలాసార్లు సరైన పరిశుభ్రతా పాటించినా ఫలితం ఉండదు. దీనికి కారణం, మీరు కొన్ని ప్రాథమిక నియమాలను పాటించకపోవడమే. ముఖ్యంగా మీరు వాడే కొన్ని వస్తువులను ఇతరులతో పంచుకోకూడదు.

ఇప్పటికీ చాలా ఇళ్లలో ఒకే సబ్బును అందరూ వాడుతుంటారు. ఇది సాధారణంగా అనిపించవచ్చు, కానీ మీ అందానికి, ఆరోగ్యానికి ఇది చాలా హానికరం. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మీ స్నానపు సబ్బును ఇతరులతో పంచుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లు, చర్మ అలర్జీలు, దురద, దద్దుర్లు వచ్చే ప్రమాదం ...