Hyderabad, మార్చి 11 -- మహిళలందరికీ కామన్‌గా ఉండే సమస్య పీరియడ్స్ నొప్పి. నెలసరి సమయంలో సహజంగానే ప్రతి మహిళ ఈ సమస్యను ఎదుర్కొంటుంది. పీరియడ్స్ సమయంలో వారు గడిపే 5 రోజులు, నెలలోని ఇతర రోజులతో పోలిస్తే చాలా కష్టంగా అనిపిస్తాయి. ఈ సమయంలో పొట్ట, నడుము నొప్పి లేదా మానసిక మార్పులు చాలా సహజం. కానీ, కొన్నిసార్లు పీరియడ్స్ సమయంలో చేసే కొన్ని తప్పులు నెలసరి కష్టాలను మరింత పెంచవచ్చు. మీరు కూడా అలాంటి తప్పులు చేస్తున్నారా? దీని వల్ల మీకు తీవ్రమైన నొప్పి వస్తుందా? పీరియడ్స్ సమయంలో ఏమి చేయకూడదో తెలుసుకుందాం.

చాలా మంది మహిళలు పీరియడ్స్ సమయంలో ప్రతిసారీ టాయిలెట్‌కు వెళ్ళినప్పుడు యోని ప్రాంతాన్ని నీటితో శుభ్రం చేసుకుంటూ ఉంటారు. అయితే, ఈ అలవాటు ఆరోగ్యానికి మంచిది కాదు. పీరియడ్స్ సమయంలో యోని ప్రాంతాన్ని పదేపదే నీటితో శుభ్రం చేసుకుంటూ ఉండటం వల్ల ఇన్ఫెక్షన్ ...