భారతదేశం, జనవరి 26 -- అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలపై అందరి దృష్టి పడుతుంది. అమెరికా ఫస్ట్ పాలసీ, కెనడా వంటి అనేక దేశాలకు వార్నింగ్‌లు ఇవ్వడంలో ట్రంప్ ఎక్కడ తగ్గినట్టుగా కనిపించడం లేదు. గాజా విషయంలో తాజాగా డొనాల్డ్ ట్రంప్ పెద్ద ప్రకటన చేశారు. జోర్డాన్, ఈజిప్ట్ కలిసి గాజాను స్వాధీనం చేసుకోవాలని, తద్వారా అక్కడ శాంతి నెలకొంటుందని ట్రంప్ అన్నారు.

శనివారం గాజాకు సంబంధించి ప్రకటన చేశారు. జోర్డాన్ రాజు అబ్దుల్లా II, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా అల్-సిసితో ఫోన్‌లో మాట్లాడినట్లు చెప్పారు. గాజా నుంచి వచ్చే శరణార్థులకు ఇరు దేశాలు తమ దేశాల్లో ఆశ్రయం ఇవ్వాలని కోరారు. దీని గురించి చాలా అరబ్ దేశాలతో కూడా మాట్లాడుతున్నానని ట్రంప్ అన్నారు. గాజా ప్రజలను ఇతర దేశాలలో పునరావాసం కల్పించడం ద్వారా గాజాను ఖాళీ చేయాలన్...