భారతదేశం, ఏప్రిల్ 14 -- 78 ఏళ్ల డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎవరూ ఊహించని నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎప్పటికీ వార్తల్లో నిలుస్తున్నారు. టారిఫ్‌లతో ఒక్కసారిగా అందరినీ ఉలిక్కిపడేలా చేశారు. ట్రంప్ నిర్ణయాలు ఒకదాని తర్వాత మరొకటి వాటి అమలు యావత్ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తాజాగా వైట్‌హౌస్ వైద్యులు ట్రంప్ ఆరోగ్యాన్ని క్షుణ్ణంగా పరీక్షించి పూర్తి ఫిట్‌గా ఉన్నారని నివేదించారు.

అధ్యక్షుడు ట్రంప్ మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉన్నారని, దేశాధినేతగా తన విధులన్నీ నిర్వర్తించగలరని వైట్ హౌస్ వైద్యులు తెలిపారు. అయితే డొనాల్డ్ ట్రంప్ చర్మంపై కొన్ని సమస్యలు ఉన్నాయని వైద్యులు నివేదికలో పేర్కొన్నారు. బలమైన సూర్యరశ్మి కారణంగా ఈ సమస్య ఏర్పడింది. దీనికితోడు ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయనపై దాడి చేసిన సమయంలో ఆయ...