భారతదేశం, మార్చి 7 -- US travel ban on Pakistan and Afghanistan: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరలో పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ దేశాల ప్రజలు అమెరికాలోకి ప్రవేశించకుండా వారిపై ట్రావెల్ బ్యాన్ విధించబోతున్నట్లు తెలుస్తోంది. దీనిపై వారం రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. వచ్చే వారం నుంచి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్ కు చెందిన వారు అమెరికాలోకి ప్రవేశించలేరని సంబంధిత వర్గాలు తెలిపాయి.

కొన్ని దేశాల పౌరుల వల్ల అమెరికా పౌరులకు భద్రతాపరమైన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలున్నాయనే అంశంపై ఉన్నత స్థాయి సమీక్ష అనంతరం, పాక్, అఫ్గాన్ లపై ట్రావెల్ బ్యాన్ విధించాలని ట్రంప్ నిర్ణయానికి వచ్చినట్లు పేరు వెల్లడించడానికి ఇష్టపడని యూఎస్ అధికార వర్గాలు తెలిపాయి. ఈ జాబితాలో పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ లతో పాటు ఇతర దేశాలను కూడా చేర్చే అవకాశముందని వెల్లడి...