Hyderabad, ఫిబ్రవరి 23 -- Actors Who Dominated Heroes In Movies: సినిమాల్లో హీరో క్యారెక్టర్ అందరికంటే ఎక్కువగా ఇంపార్టెన్స్‌తో ఉంటుంది. మెయిన్‌గా హీరోకు ఎలివేషన్స్ ఇచ్చే సీన్స్‌తోనే సినిమా సాగుతుంటుంది. ఇక సినిమాల్లో హీరోలకు మించిన పాత్రలు ఏవి ఉండవు. కొన్నిసార్లు మాత్రమే పవర్‌ఫుల్ విలన్ రోల్స్ పడతాయి. కానీ, అవి కూడా హీరోను మరింత ఎలివేట్ చేసేందుకే ఉంటుంది.

అయితే, సినిమాలను ఒంటి చేత్తో నడిపించే హీరోలను కూడా తమ యాక్టింగ్‌తో డామినేట్ చేసి క్రేజ్ తెచ్చుకున్న నటులు ఉన్నారు. సినిమాల్లో హీరోలను డామినేట్ చేసిన యాక్టర్స్, వారి పాత్రలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన తెలుగు కామెడీ రొమాంటిక్ మూవీ సొంతం. 2002లో వచ్చిన ఈ సినిమాలో ఆర్యన్ రాజేష్ హీరోగా, నమిత హీరోయిన్‌గా చేశాడు. సునీల్ కమెడియన్‌గా అలరించాడు. అయితే, ఈ మూవీలో...