భారతదేశం, ఏప్రిల్ 20 -- Do aur Do Pyaar Movie: ఇలియానా సిల్వ‌ర్‌స్క్రీన్‌పై క‌నిపించి మూడేళ్లు దాటిపోయింది. గ‌త ఏడాది ఓ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది ఇలియానా. మైఖేల్ డోలాన్ అనే అమెరిక‌న్ ఫిల్మ్ మేక‌ర్స్‌తో చాలా కాలంగా ర‌హ‌స్య ప్రేమ‌య‌ణాన్ని సాగిస్తోన్న ఈ గోవా బ్యూటీ అత‌డితో క‌లిసి ఓ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. పెళ్లికి ముందే ఇలియానా త‌ల్ల‌వ్వ‌డం బాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.

పెళ్లి, మాతృత్వ బంధం కార‌ణంగా చాలా కాలం పాటు సినిమాల‌కు దూరంగా ఉన్న ఇలియానా శుక్ర‌వారం దో ఔర్ దో ప్యార్ మూవీతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపొందిన ఈ మూవీలో ఇలియానాతో పాటు విద్యాబాల‌న్ హీరోయిన్లుగా న‌టించారు.

ప్ర‌తీక్ గాంధీ, సెంథిల్ రామ‌మూర్తి హీరోలుగా న‌టించారు. మెడ్ర‌న్ డే రిలేష‌న్స్ ఆధారంగా శిర్షా గుహా తెర‌కెక్కించిన ఈ మూవీ తొలి రోజు పాజి...