Hyderabad, మార్చి 29 -- ఇళ్లంటే రకరకాల వస్తువులు, రకరకాల ఆహార పదార్థాలు ఉంటాయి. వీటన్నింటి కలయికతో ఇంట్లో ఎప్పుడూ అదో రకమైన వాసన వస్తుంది. ఇది దుర్వాసనగా మారి అందరినీ ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు చాలా మంది రూం ఫ్రెష్‌నర్‌లను ఉపయోగిస్తుంటారు. ఇందుకోసం ప్రతి నెల చాలా డబ్బు ఖర్చు చేసి వాటిని కొనుగోలు చేస్తుంటారు. మీరు కూడా అలాగే చేస్తున్నట్లయితే ఇప్పటి నుంచి మీ డబ్బుని వృథా చేసుకోకండి. అలాగే ఆరోగ్యాన్ని కూడా. ఎందుకంటే బయట మార్కెట్లో దొరికే రూం ఫ్రెష్‌నర్ లలో హనికరమైన కెమికల్స్ ఉంటాయి. వీటి వాసన పీల్చుకోవడం వల్ల దీర్ఘకాలికంగా హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడుతుంది. ఇంకా చాలా రకాల సమస్యలు ఎదురవుతాయి.

ఇలా డబ్బుతో పాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకునేలా మీరే సహజమైన రూం ఫ్రెష్‌నర్‌ తయారు చేసుకోవచ్చు. కేవలం మూడే మూడు పదార్థాలతో ఇంట్లోనే ఈజీగా రూం ఫ్రెష్‌నర...