Hyderabad, మార్చి 11 -- హోలీ అంటేనే రంగుల పండుగ. ఈ రోజున కుటుంబ సభ్యులు, స్నేహితులు ముఖ్యంగా బావా మరదల్లు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ పండుగను జరుపుకుంటారు. వాస్తవానికి ఇలా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకోవడం చాలా సంతోషాన్నిస్తుంది. కానీ కొన్నిసార్లు ఈ రంగులు చర్మాన్ని, కురులను దెబ్బతీసే ప్రమాదముంది. ఎందుకంటే మీరు తెచ్చుకునే రంగులో రకరకాల రసాయనాలు, హానికరమైన పదార్థాలు ఉంటాయి. ఇవి చర్మం, కురులతో పాటు మొత్తం శరీరానికి హాని కలిగించే ప్రమాదముంది.

మరేం చేయాలి..? హోలీ ఆడకూడదా ఏంటీ.. అంటారా? నిస్సందేహంగా ఆడచ్చు. కాకపోతే హానికరమైన రంగులతో కాకుండా ఆర్గానిక్ హోం మేడ్ కలర్స్‌తో. సహజమైన రంగులతో పండుగను సంతోషంగా జరుపుకోవచ్చు. వీటిని మీరు ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. అది కూడా వంటింట్లో ఎప్పుడూ ఉండే కూరగాయలతో. ఇవి మీ పిల్లల చర్మాన్ని, మీ చర్మాన్ని, కుర...