Hyderabad, మార్చి 3 -- చిన్నచిన్న అభిప్రాయ భేదాలకే విడాకులు తీసుకుంటున్న భార్యాభర్తలు ఎంతోమంది ఉన్నారు. వారిద్దరూ తమ తమ గౌరవాలకు. అభిప్రాయాలకు విలువ ఇచ్చుకుంటారు. తమవల్ల ఈ భూమి మీదకు వచ్చిన పిల్లలకు మాత్రం ఎలాంటి విలువ ఇవ్వకుండా విడాకులు తీసుకుంటారు. ఏ బిడ్డ అయినా తల్లిదండ్రులు కలిసే తనను ప్రేమగా చూసుకోవాలని కోరుకుంటాడు. కానీ తల్లి తండ్రి మధ్య ఎవరిని ఎంచుకోవాలన్న ప్రశ్న అతని ముందుకు వస్తుందని ఊహించడు. కాబట్టి విడాకుల ప్రక్రియ పర్యవసనాలు అనేవి పిల్లలను మానసికంగా చాలా దెబ్బతీస్తాయి.

ముఖ్యంగా పిల్లలు ఆరు నుంచి 12 సంవత్సరాల మధ్య ఉంటే ఆ భార్యాభర్తలు విడాకులు తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే ఆ కాలం పిల్లలు ఏ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేడు. కానీ సందేహాలు మాత్రం అతడిని వేధిస్తూనే ఉంటాయి. బయటకి గంభీరంగానే కనిపిస్తాడు, నవ్వుతాడు, తింటాడు... అన్...