Hyderabad, ఫిబ్రవరి 27 -- ఏళ్ల తరబడి కలిసి ఉన్న జంటలు, ఎన్నో ఒడిదుడుకులను కలిసి జయించిన భార్యభర్తలు విడాకుల వైపుకు ఎందుకు మొగ్గుతున్నారు? జీవితం సగానికి పైగా గడిచిపోయిన తర్వాత తమ బంధాన్ని ముగించుకోవాలని ఎందుకు అనుకుంటున్నారు? ఇటీవలి కాలంలో యాభై ఏళ్లు పైబడిన వారు ఎక్కువగా విడిపోవడానికి కారణాలు ఏంటి? ప్రముఖ మానసిక ఆరోగ్య సలహాదారు, ఎన్నోవెల్ నెస్ వ్యవస్థాపకురాలు అరూబా కాబీర్ తన హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌తో పంచుకున్నారు.

సోషల్ మీడియాలో ఈ మధ్య "గ్రే డివోర్స్"(Grey Divorce) అనే పదం బాగా ట్రెండ్ అవుతోంది. బహుషా దీనికి అర్థం చాలా మందికి తెలియకపోవచ్చు. ఈ మధ్య కాలంలో విడాకులు తీసుకుంటున్న జంటల్లో యుక్త, మధ్య వయస్సు వారి కన్నా వృద్ధుల సంఖ్య మరింత ఎక్కువగా కనిపిస్తుందట. సెలబ్రిటీల్లో ఈ కల్చర్ ను ఎక్కువగా చూడచ్చు. దశాబ్బాలుగా కలిసి జీవించిని జంటలు వృద్ధాప్...