Hyderabad, మార్చి 4 -- శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల గుండె జబ్బులు త్వరగా వస్తాయి. చెడు కొలెస్ట్రాల్ అనేది ఎన్నో ప్రాణాంతక సమస్యలకు కారణం అవుతుంది. కాబట్టి కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవారు ఇంటి చిట్కాల ద్వారా కూడా దాన్ని కరిగించుకోవచ్చు. ఆయుర్వేదం చెబుతున్న ప్రకారం చెడు కొలెస్ట్రాల్‌ను వదిలించుకోవడానికి వెల్లుల్లి, నెయ్యి ఉత్తమంగా పనిచేస్తాయి.

వెల్లుల్లి రెబ్బలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రతిరోజూ ఒక వెల్లుల్లి రెబ్బ తింటే ఎన్నో వ్యాధులు మన దగ్గరికి రావు. వెల్లుల్లి వినియోగం వల్ల రోగనిరోధక శక్తి కూడా బలోపేతం అవుతుంది. వెల్లుల్లి పచ్చిగా తినమని సలహా ఇస్తారు వైద్యులు. కానీ దానిని చాలా మంది తినలేక పోతారు. దీని వల్ల వెల్లుల్లి చిట్కాను ఎవరు ఫాలో అవ్వలేకపోతున్నారు. దీనికి ఒక మార్గం ఉంది.

పచ్చి వెల్లుల్లిని తినలేకపోతున్నవారు ద...