భారతదేశం, ఫిబ్రవరి 1 -- Disney+ Hotstar February Releases: డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఎప్పటిలాగే ఈ ఫిబ్రవరి నెలలోనూ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లతో ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది.

ఇందులో మెగా ఇంటి కోడలు లావణ్య త్రిపాఠీ నటించిన వెబ్ సిరీస్ తోపాటు సూపర్ హీరో సినిమాలు, రొమాంటిక్ కామెడీలు కూడా ఉన్నాయి. మరి ఈ నెలలో హాట్ స్టార్ మన ముందుకు తీసుకొస్తున్న ఆ సినిమాలు, సిరీస్ ఏంటో ఒకసారి చూద్దాం.

పులి మేక వెబ్ సిరీస్ తో ఓటీటీలో ప్రేక్షకులకు దగ్గరైన లావణ్య త్రిపాఠీ ఇప్పుడు మరో సిరీస్ తో వస్తోంది. ఈ వెబ్ సిరీస్ పేరు మిస్ పర్ఫెక్ట్. ఈ రొమాంటిక్ కామెడీ సిరీస్ శుక్రవారం (ఫిబ్రవరి 2) నుంచి హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఓసీడీతో బాధపడుతూ అంతా ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండాలనుకునే అమ్మాయి పాత్రలో లావణ్య ఇందులో నటించింది. ఈ సిరీస్ లో లావణ్యతో...