భారతదేశం, ఏప్రిల్ 8 -- హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో ఫిబ్రవరి 21, 2013న.. రెండు బాంబులు ఒకదాని తర్వాత మరొకటి నిమిషాల వ్యవధిలో పేలాయి. జంట బాంబు పేలుళ్లలో 18 మంది మరణించారు. 131 మందికి గాయాలయ్యాయి. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ టేకప్ చేసింది. ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన యాసిన్ భత్కల్, అసదుల్లా అక్తర్, జియా-ఉర్-రెహమాన్, తెహసీన్ అక్తర్, అజాజ్ షేక్‌లను ఎన్ఐఏ అరెస్టు చేసింది.

ఈ కేసులో మరో ప్రధాన నిందితుడు రియాజ్ భత్కల్ ఇంకా పరారీలో ఉన్నాడు. 2016 డిసెంబర్ 13న, ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఈ ఐదుగురు నిందితులను దోషులుగా నిర్ధారించింది. డిసెంబర్ 19న వారికి మరణశిక్ష విధించింది. ఎన్ఐఏ కోర్టు తీర్పును సవాలు చేస్తూ.. నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తెలంగాణ హైకోర్టు ఏప్రిల్ 8, 2025న తుది తీర్పును వెలువరించింది.

ఈ పేలుళ్ల కేసుల...