భారతదేశం, మార్చి 14 -- Dilruba Review: క బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత కిర‌ణ్ అబ్బ‌వ‌రం హీరోగా న‌టించిన మూవీ దిల్‌రూబా. యూత్‌ఫుల్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీకి విశ్వ క‌రుణ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. రుక్స‌ర్ థిల్లాన్‌, న‌జియా హీరోయిన్లుగా న‌టించారు. ఈ వారం రిలీజ్ అయిన సినిమాల్లో దిల్ రూబా పైనే ఎక్కువ‌గా అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఈ మూవీతో కిర‌ణ్ అబ్బ‌వ‌రానికి మ‌రో హిట్ ద‌క్కిందా? దిల్ రుబా యూత్ ఆడియెన్స్‌ను మెప్పించిందా? లేదా? అంటే?

సిద్ధార్థ్ అలియాస్ సిద్ధు (కిర‌ణ్ అబ్బ‌వ‌రం) జీవితంలో కొన్ని ఎదురుదెబ్బ‌లు త‌గులుతాయి. ప్రాణంగా ప్రేమించిన మ్యాగీ అత‌డికి బ్రేక‌ప్ చెప్పి వెళ్లిపోతుంది. తండ్రిని స్నేహితుడు మోసం చేస్తాడు. దాంతో ఎవ‌రికి సారీ, థాంక్యూ చెప్ప‌కూడ‌ద‌ని ఫిక్స‌వుతాడు సిద్ధు. త‌న జీవితంలో ప్రేమ అన్న ప‌దానికి చోటు లేకుండా బ‌త‌కేయాల‌ని...